BSNL: కేవలం రూ.51కే నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. BSNL అదిరిపోయే ఆఫర్..

Date:

బీఎస్‌ఎన్‌ఎల్ మరో అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. అదేంటంటే.. రూ.51కే 28 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా అందించనుంది. అలాగే అదిరిపోయే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.999 ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్ తీసుకొచ్చింది. దీని వివరాలు ఇప్పుడు చూద్దాం.

బీఎస్‌ఎన్ఎల్ మరో అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ తీసుకోవాలనుకునేవారికి, బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి మారాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది. సిమ్ ఉచితంగా అందించనుంది. అనంతరం ఫస్ట్ రీఛార్జ్ రూ.51 ఆఫర్ అందించనుంది. రూ.51తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబీ డేటా పొందవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 28 రోజుల పాటు ఈ సౌకర్యాలు పొందవచ్చు. ఆగస్ట్ 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ ఇండియా తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపింది.

రూ.51కే 28 రోజుల పాటు..

రూ.51కే నెల రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్, 2జీబీ డేటా అంటే బంపర్ ఆఫర్‌గా చెప్పవచ్చు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్ఎల్ ఈ ఆఫర్ ప్రవేశపెట్టింది. సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా ఆధీకృత రిటైలర్‌ను సంప్రదించి ఈ ఆఫర్ పొందవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ స్పష్టం చేసింది. “మీరు ఎదురుచూస్తున్న స్విచ్ వచ్చేసింది. FRC రూ.51 ఆఫర్‌తో మీ BSNL ప్రయాణాన్ని ప్రారంభించండి. మొదటి రోజు నుండే కనెక్ట్ అయి ఉండటానికి అవసరమైన ప్రతిదాన్నీ ఆస్వాదించండి” అంటూ బీఎస్‌ఎన్‌ఎల్ తన అకౌంట్‌లో పేర్కొంది.

రూ.150కే 30 రోజుల ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ యాక్సెస్

ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఎక్కువ వాడేవారికి ప్రత్యక ఫ్రీడమ్ ఆఫర్ బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. రూ.150తో జియో హాట్ స్టార్, జీ5, సోనీ లైవ్ సబ్‌స్క్రిప్షన్లను 30 రోజుల పాటు పొందవచ్చు. పాత ఎప్‌టీటీహెచ్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. సాధారణంగా దీని ధర రూ.199గా ఉండగా.. ఇప్పుడు రూ.150కే అందిస్తోంది. ఇక రూ.999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో నెలకు 200ఎంబీపీఎస్ వేగంత 5 వేల జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు. ఇక ఉచిత కాల్స్‌తో పాటు జియో హాట్ స్టార్, సోనీ లైవ్, జీ5, హంగామా వంటి ఓటీపీ ఫ్లాట్‌ఫామ్స్ లభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...