ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

Date:

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండలం కెల్ల వద్ద సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది.

సుమారుగా 8 వేల కోట్ల పెట్టుబడితో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రెండు దశలలో ఈ నిర్మాణం పూర్తి చేయనున్నారు. దీని ద్వారా 750 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ విషయాన్ని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ చేరాయి. ఈ సందర్భంగా కిమిడి కళా వెంకట్రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మాట్లాడిన కిమిడి కళా వెంకటరావు.. చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా చీపురుపల్లి నియోజవర్గంలో 8 వేల కోట్ల రూపాయలతో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

మరోవైపు చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని గుర్ల మండలంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. కెల్ల సమీపంలో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం కెల్ల సమీపంలో 1,085 ఎకరాల భూమిని కేటాయించింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...