ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నియామకాల్లో మేనేజర్ పోస్టులకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు వేతన స్కేల్ ఉండగా, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు వేతనం లభిస్తుంది. మేనేజర్ పోస్టులకు సుమారు రూ.21 లక్షల వార్షిక CTC ఉండొచ్చని సమాచారం.
ఏ పోస్టుల్లో ఖాళీలు?
మేనేజర్ పోస్టుల్లో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫైనాన్స్, ఐటీ, ఆర్కిటెక్చర్, లా, ఫైర్ సర్వీసెస్, ఆపరేషన్స్ తదితర విభాగాలు ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఫైనాన్స్, లా, ఆపరేషన్స్, సర్వే అండ్ కార్టోగ్రఫీ విభాగాల్లో ఉన్నాయి.
మొత్తం 389 పోస్టుల్లో 260 మేనేజర్ పోస్టులు, 129 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. మేనేజర్ (ఇంజినీరింగ్–సివిల్) పోస్టులకు అత్యధికంగా 145 ఖాళీలు ఉండగా, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్) పోస్టులకు 79 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు తేదీలు
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 ఆగస్టు 8న ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అప్లికేషన్ వెరిఫికేషన్ తదితర దశలు ఉంటాయి. మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
అభ్యర్థులు పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, అనుభవం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలను AAI అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి, గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.

