D news: కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య ప్రస్థానాన్ని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
భారతదేశం స్వాతంత్ర్యం సాధించి ఎనిమిది దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రగతిని గుర్తుచేసిన పవన్ కల్యాణ్.. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడిందని, మరో తరం స్వాతంత్ర్యాన్ని కాపాడిందని, ఇప్పుడు దేశ నిర్మాణానికి తదుపరి తరాలు బలమైన పునాదులు వేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘వందేమాతరం’కు 150 సంవత్సరాలు పూర్తవుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. దేశభక్తి, ఐక్యత, జాతీయ సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.


