
పెనుకొండలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సవిత పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి సవిత 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
అమరవీరుల త్యాగస్ఫూర్తితో ప్రజా సంక్షేమం, బీసీల అభ్యున్నతి, చేనేత రంగ సమగ్ర వికాసానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రజల సంక్షేమం, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

