
వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్తో కలిసి పోలీసు పటాలాల మార్చ్‌ఫాస్ట్‌ను మంత్రి తిలకించారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు.
జిల్లాలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సంక్షేమం, జిల్లాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
విధి నిర్వహణలో నిబద్ధతతో సేవలందిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

