మావోయిస్టులు, వేర్పాటువాదుల మద్దతుదారులకే వర్తిస్తాయి

Date:

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను ‘మావోయిస్టు మనస్తత్వం గల వ్యక్తులు’గా పేర్కొనలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం సహా పలువురు చేసిన విమర్శలకు ఆయన స్పందించారు.

‘ఎక్స్‌’ వేదికగా రిజిజు వివరణ ఇస్తూ.. ‘దిమాగీ నక్సల్స్‌’ అనే పదాన్ని రాజ్యాంగాన్ని తిరస్కరించే మావోయిస్టు అనుకూలులు, వేర్పాటువాదులకు మద్దతిచ్చేవారు, ఆర్టికల్‌ 370కు అనుకూలంగా నిలిచేవారిని ఉద్దేశించే ఉపయోగించినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వేరు చేయాలంటూ ‘చికెన్‌ నెక్‌’ను కత్తిరించాలని పిలుపునిచ్చే వారిని కూడా ఈ వ్యాఖ్యలు సూచిస్తాయని పేర్కొన్నారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ దేశ అభివృద్ధిని అడ్డుకునే ‘దిమాగీ నక్సల్స్‌’ కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం స్పందిస్తూ.. తాను ‘దిమాగీ నక్సల్‌ కావడం గర్వంగా ఉంది’ అంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

మరోవైపు దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కూడా ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు. యువతను రాజకీయ లేబుళ్లతో కాకుండా విద్య, విమర్శనాత్మక ఆలోచన, మానసిక ఆరోగ్యంపై అవగాహన వంటి మార్గాల ద్వారా ప్రభావితం చేయాలని సూచించారు. రాజకీయంగా వ్యక్తులకు లేబుళ్లు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...