చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? శరీరం ఇస్తున్న ఈ వార్నింగ్‌ను అస్సలు లైట్ తీసుకోకండి!

Date:

కీళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగానే చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం యువతలోనూ మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు వంటి కీళ్లలో నొప్పి, బిగుతు, వాపు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడేవారు, జిమ్‌లో అధికంగా వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు మాత్రమే కాకుండా.. రోజువారీ జీవితంలో ఒకే రకమైన కదలికలను పదేపదే చేసే వారిలోనూ ఈ సమస్య తలెత్తవచ్చు.

కీళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగానే చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం యువతలోనూ మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు వంటి కీళ్లలో నొప్పి, బిగుతు, వాపు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడేవారు, జిమ్‌లో అధికంగా వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు మాత్రమే కాకుండా.. రోజువారీ జీవితంలో ఒకే రకమైన కదలికలను పదేపదే చేసే వారిలోనూ ఈ సమస్య తలెత్తవచ్చు.

అసలు కారణాలు ఏమిటి?

కీళ్ల నొప్పులకు ఒక్కటే కారణం ఉండదు. గాయం, బెణకడం, కండరాలపై అధిక ఒత్తిడి వంటివి కీలు చుట్టూ ఉన్న కణజాలాన్ని దెబ్బతీసి నొప్పి, వాపుకు కారణమవుతాయి. ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనే యువతలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు. మరో కారణం గౌట్. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయులు పెరిగి దాని స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోతే అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపు, వేడి వంటి లక్షణాలు కనిపించవచ్చు.

అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల్లో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున కీళ్లపై దాడి చేయడం వల్ల నొప్పి, వాపు ఏర్పడతాయి. వయసుతో ఎక్కువగా సంబంధం ఉన్న ఆస్టియో ఆర్థరైటిస్ కూడా కొన్ని సందర్భాల్లో చిన్న వయసులోనే కనిపించవచ్చు. కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి దెబ్బతినడం, అరిగిపోవడం వల్ల కదలికలో నొప్పి, బిగుతు ఏర్పడుతుంది. ఇవే కాకుండా టెండినైటిస్, లూపస్, ఫైబ్రోమయాల్జియా, థైరాయిడ్‌ సమస్యలు, కొన్ని వైరల్‌ ఇన్ఫెక్షన్లు కూడా కీళ్ల నొప్పులకు కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం!

కీళ్ల నొప్పితో పాటు వాపు, ఎరుపు, అధిక వేడి లేదా జ్వరం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. గాయం తర్వాత కీలు ఆకారం మారడం, అకస్మాత్తుగా తీవ్రమైన వాపు రావడం లేదా నొప్పి కారణంగా కీలును కదపలేకపోవడం వంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి. తేలికపాటి నొప్పి కొన్నిసార్లు విశ్రాంతితో తగ్గిపోవచ్చు. కానీ నొప్పి తరచూ పునరావృతమవుతున్నా, ఎక్కువకాలం కొనసాగుతున్నా దాని కారణాన్ని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

ముఖ్యంగా నొప్పి తగ్గించుకోవడానికి మందులను సొంతంగా దీర్ఘకాలం ఉపయోగించడం కంటే వైద్యుల సలహా తీసుకోవడం సురక్షితం. చిన్న వయసులో తరచుగా వచ్చే కీళ్ల నొప్పిని “వయసు తక్కువే కదా” అంటూ నిర్లక్ష్యం చేయకుండా.. కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ముఖ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...