కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఉన్న సశస్త్ర సీమా బల్ (SSB) ఫ్రంటియర్ హెడ్‌క్వార్టర్స్‌లో వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఫ్రంటియర్ హెడ్‌క్వార్టర్స్ పరిపాలనా భవనం, సిబ్బంది నివాస సముదాయాలు, ఇతర నివాస, నివాసేతర భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సరిహద్దు భద్రతా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎస్ఎస్బీ సిబ్బందితో సమావేశమై, వారితో ముచ్చటించనున్నారు. అనంతరం సంప్రదాయ ‘బారా ఖానా’ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.



