పోలీస్ శాఖలో కొలువుల జాతర

Date:

పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేయగా తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

బెల్లంపల్లి(మంచిర్యాల): పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేయగా తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం వేల సంఖ్యలో ఖాళీలకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. పలువురు కోచింగ్‌ సెంటర్‌లకు వెళ్తుండడంతో సందడి మొదలైంది.

కమిషనరేట్‌ పరిధిలో వందల సంఖ్యలో పోలీసు కొ లువులు ఖాళీ ఉన్నాయి. జిల్లాలో ప్రతి సంవత్సరం పో లీసు ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. స్థానికత(లోకల్‌ కేడర్‌) ప్రకారం ఖాళీల వివరాలను సంబంధిత శాఖలు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ఇప్పటికే పంపించినట్లు అధికారులు ప్రకటిం చారు దీంతో స్థానిక కేడర్‌ ఆధారంగా పోస్టుల పంపిణీ జరుగనున్న నేపథ్యంలో జిల్లాకు కూడ గణనీయమైన పోస్టులు వచ్చే అవకాశం ఉందని నిరుద్యోగులు భావిస్తు న్నారు. జిల్లాలో ప్రతి నియామకంలో పోలీసు ఉద్యోగాలకు వేలాది మంది పోటీ పడుతుంటారు.

రామగుండం కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 1875 మంది పోలీసులకు గాను 1334 మంది విధులు నిర్వహి స్తున్నారు. 541 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సివిల్‌ కానిస్టేబుల్స్‌కు సంబంధించి 1325 పోస్టులకు గా ను 819 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 506 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఏఆర్‌ కానిస్టే బుళ్లు 563కు గాను 485 మంది విధులు నిర్వహిస్తు న్నా రు. 78 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పరుగుపందెం, పరీక్షలో నెగ్గితేనే…

పోలీసు ఉద్యోగం సాధించాలంటే పరుగుపందెంతో పాటు పరీక్షలో సైతం ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పురుషులైతే రన్నింగ్‌ 1600మీటర్లు(7.15నిమిషాల్లోపు), లాంగ్‌జంప్‌ నాలుగుమీటర్లు, షాట్‌ఫుట్‌ 6మీటర్లు, మ హిళలు పరుగుపందెంలో 800 మీటర్లు (5.20నిమి షాలు), లాంగ్‌జంప్‌ 2.5మీటర్లు, షాట్‌ఫుట్‌ 4 మీటర్ల విభాగాల్లో అర్హత సాధించాలి.

ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్తా…

  • శ్రీనివాస్‌, సోమగూడెం

పోలీసు ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్తాను. దేహదారుఢ్యం కోసం జిమ్‌కు వెళ్తున్నాను. అలాగే రన్నింగ్‌, ఇతరత్ర కోసం ప్రతి రోజు మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఎలాగైన మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించి కల నెరవేర్చుకుంటాను.

పోలీసు కావాలన్నదే కల…

  • వెంకటేశ్‌, చర్లపల్లి

చిన్నప్పటి నుంచి పోలీసు కొలువు సాధించాల నేది ఆశగా పెట్టుకున్నాను. గతసారి నోటిఫికేషన్‌ విడుద లైన సమయంలో చాలా కష్టపడ్డాను. కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం సాధించలేకపోయాను. ఈసారి ఎలా గైన కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించి కల నెరవేర్చు కోవడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటాను.

ఆత్మవిశ్వాసంతో శ్రమించాలి

యువతలో పోలీసు ఉద్యోగం సాధించాలనే పట్టుదల, ఆత్మవిశ్వాసం మెండుగా ఉం టే ఉద్యోగం సాధించవచ్చు. ప్రతీరోజు మైదానంలో తప్పని సరిగా కసరత్తులు చేయాలి. దీంతో పాటు పరీక్షలకు సంబంధించి కరెంటు అఫైర్స్‌, ఇండియన్‌పాలిటి, జియోగ్రఫీ, జనరల్‌ సైన్స్‌, ఇంగ్లీష్‌, జనరల్‌ నాలె డ్జ్‌కు సన్నద్ధం కావాలి. పోలీసు ఉద్యోగాలకు ఎక్కువ మంది పోటీగా ఉన్నారని భావించకుండా లక్ష్యం వైపు గురి పెట్టాలి. యువత పోలీసు ఉద్యో గాలు సాధించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుని సమాజసేవలో భాగస్వాములు కావాలి.

  • కిరణ్‌కుమార్‌, ఏసీపీ, బెల్లంపల్లి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...