US-Israel Iran War : చర్చల్లేవ్ తగ్గేదేలే అంటున్న ఇరాన్.. ఒకేసారి 7 దేశాలపై దాడులు.

Date:

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. కువైట్, ఖతర్, యూఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది తెలుగువారు భయాందోళనల్లో గడుపుతున్నారు. ఆకాశంలో పేలుళ్ల దృశ్యాలను చూసి ఇక్కడ వారి కుటుంబసభ్యులు క్షణక్షణం భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సమయంలో మోదీ ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడారు.

ఇజ్రాయిల్-ఇరాన్ వార్ భీకరంగా మారుతోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం మిడిల్ ఈస్ట్‌నే అతలాకుతలం చేస్తోంది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు జరిగాయి.

ఆకాశంలో పేలుతున్న దృశ్యాలు చూసి హైదరాబాద్ వాసులు భయప్రాంతాలకు గురవుతున్నారు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణకు చెందిన లక్షల మంది గల్ఫ్‌ దేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయంతో గడుపుతున్నారు. ప్రస్తుతం గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ ఉపాధి పొందుతున్న వారి బాధిత కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది.

మరోవైపు ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్‌ మరో ప్రకటన చేశారు. 9 ఇరాన్‌ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయని, ఇరాన్‌ నేవీ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ధ్వంసం చేశామన్నారు. మిగిలిన నౌకల వేట కూడా కొనసాగుతోందని.. ఇరాన్‌ నౌకాదళం మొత్తం నాశనమైందని తెలిపారు.

దాడుల్లో 48 మంది ఇరాన్‌ నేతలు చనిపోయారన్నారు. చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వద్దని తెలిపారు ట్రంప్‌. ఇరాన్ నేతలు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నారని, ఇరాన్‌తో చర్చలకు సిద్ధం అన్నారు ట్రంప్‌. చర్చల కోసం ఇరాన్‌ ముందే రావాల్సిందన్నారు ట్రంప్‌.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...