ఏపీకి కేంద్రం అదనపు సాయం.. హైలెవల్ కమిటీ ఆమోదం, ఆరు రాష్ట్రాలకు రూ.1929.99 కోట్లు

Date:

ఏపీకి కేంద్రం నుంచి అదనపు సాయానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు ప్రకృతి వైపరీత్యాల సహకారం కింద రూ.1929.99 కోట్లు అందించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌కు రూ.341.48 కోట్ల అదనపు సాయాన్ని అందించనున్నారు. ఈ నిధులతో ఏపీకి కొంత ఊరట దక్కనుంది.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది.. అదనపు ఆర్థిక సాయం ప్రకటించింది. ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు మొత్తం రూ.1912.99 కోట్ల సాయం చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆరు రాష్ట్రాలకు ప్రకృతి వైపరీత్యాల సహకారం కింద ఈ సాయం అందిస్తారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీలో నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌, నాగాలాండ్‌లకు ఈ అదనపు సాయానికి ఉన్నత స్థాయి కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2025లో మొంథా తుఫాన్, ఆకస్మిక వరదలతో ఆయా రాష్ట్రాలు నష్టపోయాయి. ఈ మేరకు ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం సాయాన్ని ప్రకటించింది. మొత్తం రూ.1912.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.341.48 కోట్ల అదనపు సాయం అందించనున్నారు.

ఏపీకి రూ.341.48 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.15.70 కోట్లు, గుజరాత్‌కు రూ.778.67 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.288.39 కోట్లు, నాగాలాండ్‌కు రూ.158.41 కోట్లు, జమ్మూ కాశ్మీర్‌కు రూ.330.04 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలకు Rs. 20.735.20 కోట్లు.. 21 రాష్ట్రాలకు రూ.3,628 కోట్లు ఎన్డీఆర్‌ఎఫ్ కింద విడుదల చేసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ధోనీ రికార్డు బద్దలు.. విదేశీ టెస్టుల్లో పంత్ సరికొత్త చరిత్ర!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన...

Raw Coconut: పచ్చి కొబ్బరి తినడం మీకు ఇష్టమా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

పచ్చి కొబ్బరి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే మనదేశంలో కొబ్బరికాయకు పూజా కార్యక్రమాల్లోనే...

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...