తెలంగాణలో వంట గ్యాస్ కొరత.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Date:

తెలంగాణలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇక వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి .. రాష్ట్రంలో ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని తేల్చి చెప్పారు. సచివాలయంలో సివిల్ సప్లై కమిషనర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తలను నమ్మి.. గ్యాస్ సరఫరాపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. ప్రతి వంట గ్యాస్ వినియోగదారుడికి అవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు పంపించి.. పక్కదారి తరలిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు నిఘాను ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్టల్స్‌కు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

IRCTC: హైదరాబాద్ నుంచి కాణిపాకం–శ్రీపురం.. 3 పుణ్యక్షేత్రాల దర్శనానికి టూర్ ప్యాకేజీ

కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను...

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...