అడోబ్ సీఈఓ పదవికి శంతను నారాయణ్ రాజీనామా..! 18 ఏళ్ల తర్వాత పెనుమార్పు.. సత్య నాదెళ్ల ప్రశంసలు

Date:

టెక్ రంగంలో మరో పెను మార్పు జరిగింది. 18 ఏళ్లకుపైగా దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్‌కు సీఈఓగా నాయకత్వం వహించిన శంతను నారాయణ్ పదవి నుంచి దిగిపోనున్నారు. టెక్ రంగాన్ని ఏఐ కుదిపేస్తున్న వేళ ఈ మార్పు జరుగుతుండటం గమనార్హం. నారాయణ నిర్ణయంపై తన స్కూల్‌మేట్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ప్రశంసలు కురిపించారు. ఆయనకు ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పారు.

భారత సంతతికి చెందిన మరో వ్యక్తి.. దిగ్గజ కంపెనీ సీఈఓ పదవి నుంచి దిగిపోతున్నారు. ఆయనే శంతను నారాయణ్. అమెరికాలోని దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన అడోబ్ ఇంక్‌లో చాలా ఏళ్ల తర్వాత నాయకత్వ మార్పు జరుగుతుంది. సుమారు 2 దశాబ్దాలుగా (18 ఏళ్లకుపైగా) అడోబ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సేవలందించిన శంతను నారాయణ్ ఇప్పుడు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీనికి సంబంధించి కంపెనీ తాజాగా ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రకటన వచ్చినా.. కొత్త సీఈఓ నియామకం తర్వాత శంతను తన బాధ్యతల నుంచి పూర్తి స్థాయిలో వైదొలుగుతారు. సీఈఓగా వైదొలిగినా.. ఆయన బోర్డు ఛైర్మన్‌గా మాత్రం కొనసాగుతారని పేర్కొంది.

శంతన్ నారాయణ్ వైదొలిగేందుకు కారణాన్ని స్వయంగా ఆయన కానీ.. సంస్థ కానీ ప్రకటించలేదు. ప్రస్తుతం ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (AI) ఐటీ/టెక్ రంగాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శంతను తప్పుకోవడం ఎన్నో సందేహాల్ని లేవనెత్తుతోంది. ‘సీఈఓ బాధ్యతల నుంచి మారాలనుకుంటున్నా. బోర్డుకు నా నిర్ణయాన్ని తెలియజేశా. బోర్డు కూడా దీనిని అంగీకరించింది. అయితే.. ఇది గుడ్‌బై మాత్రం అస్సలే కాదు. బోర్డు ఛైర్మన్‌గా కంపెనీ కోసం మరింత శ్రమిస్తూనే ఉంటా’ అని నారాయణ్ స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...