
9 గ్రామాలకు నిధులు మంజూరు: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలానికి జల్ జీవన్ మిషన్ కింద రూ.219.71 లక్షల నిధులు మంజూరయ్యాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మండలంలోని తొమ్మిది గ్రామాలకు ఈ నిధులు మంజూరైనట్లు వివరించారు. పిట్టల్లంకకు రూ.2.99 లక్షలు, రామకృష్ణాపురానికి రూ.6 లక్షలు, సాలింపాలెంకు రూ.10.18 లక్షలు, ఉల్లిపాలెంకు రూ.9.68 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు.
విశ్వనాథపల్లికి రూ.45.60 లక్షలు, కోడూరుకు రూ.126.67 లక్షలు, లింగారెడ్డిపాలెంకు రూ.7.84 లక్షలు, మాచవరానికి రూ.3.72 లక్షలు, మందపాకలకు రూ.7.03 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వివరించారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
