
ముత్తుకూరు, :జమ్మూ కాశ్మీర్లోని కాత్ర పట్టణంలో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయస్థాయి టీ-10 టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు ఆదివారం బయలుదేరింది.
ఈ జట్టుకు ముత్తుకూరుకు చెందిన బి. ప్రకాష్ కోచ్గా వ్యవహరించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర, కార్యదర్శి పి. తిరుపతిరావు, టీమ్ మేనేజ్మెంట్ బాధ్యతలను గోపాలరావు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ పోటీల కోసం రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన జోష్, కీర్తివర్ధన్, నంద్యాల జిల్లాకు చెందిన విరాట్, చిన్న, ఉదయ్, చైతన్య, వరుణ్, గుంటూరు జిల్లాకు చెందిన సాత్విక్, మేఘనాథ్, కౌశిక్, సత్యసాయి జిల్లాకు చెందిన నితీష్, ప్రదీప్, నందీశ్వర్ పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు.
జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించాలని క్రీడాభిమానులు ఆకాంక్షించారు.
