గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా భయబ్రాంతులకు గురైన వాహనదారులు

Date:

రాజస్థాన్‌ లోని కిషన్‌గఢ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. జైపూర్–అజ్మేర్ నేషనల్ హైవే-48పై గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పల్టీ కొట్టింది. కిషన్‌గఢ్ టోల్ సమీపంలోని చిడియా బావడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

బర్నా గ్రామం నుండి కిషన్‌గఢ్ వైపు సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కు.. జాతీయ రహదారిపై అకస్మాత్తుగా, టైర్ పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదుపు తప్పిన లారీ రోడ్డుపై పల్టీ కొట్టినట్లు సమాచారం. వాహనం పడిపోవడంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు హైవేపై నలువైపులా చెల్లాచెదురుగా పడ్డాయి. అవి ఎక్కడ పేలుతాయోనని స్థానికులు, వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులుఅ వెంటనే అతన్ని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. కానీ అతను చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే హైవేపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సమాచారం అందుకున్న వెంటనే మదన్‌గంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, పైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం తరువాత, హైవే అంతటా చెల్లాచెదురుగా ఉన్న సిలిండర్లను చూసి స్థానికులు భయపడ్డారు. కానీ వెంటనే పోలీసులకు తమ సహాయాన్ని అందించారు. చాలా మంది రోడ్డు పక్కన ఉన్న సురక్షితమైన ప్రదేశంలోకి సిలిండర్లను చేర్చి ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంలో సహాయపడ్డారు.

సిలిండర్లు ఏవీ లీక్ కాలేదని, పెద్ద విషాదాన్ని నివారించాయని పోలీసులు చెబుతున్నారు. స్థానికుల సహాయంతో రోడ్డుపై పడ్డ సిలిండర్లను మరో వాహనంలో లోడ్ చేసి అక్కడి నుంచి తరలించారు. భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...