ఆసియాగేమ్స్ 2026లో అద్భుతమైన స్వర్ణ పతక విజయం సాధించిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.

ఆసియా గేమ్స్‌లో భాగంగా భారత్ ఖాతాలో 19వ గోల్డ్ మెడల్ చేరిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో ఈరోజు (శనివారం) జరిగిన పురుషుల క్రికెట్లో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా టీం 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. ఈ సందర్భంగా పురుషుల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.
భారత క్రికెట్‌కు మరో స్వర్ణ అధ్యాయం: పవన్ కల్యాణ్
ఆసియాగేమ్స్ 2026లో అద్భుతమైన స్వర్ణపతక విజయం సాధించిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
‘అధిక ఒత్తిడితో కూడిన ఫైనల్లో, భారత్ అత్యంత కీలకమైన సమయంలో రాణించి, పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి ఆసియా క్రీడల టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. శక్తివంతమైన బ్యాటింగ్ ప్రదర్శన, ఆ తర్వాత క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, భారత క్రికెట్‌కు మరో స్వర్ణ అధ్యాయాన్ని అందించాయి. జట్టు మొత్తానికి వారి సంయమనం, పట్టుదల, గెలుపు స్ఫూర్తికి అభినందనలు. మీరు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా మోస్తూ, దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాం’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ ఫైనల్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి: మంత్రి లోకేశ్
ఆసియాగేమ్స్ 2026లో అద్భుతమైన స్వర్ణ పతక విజయం సాధించిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
‘ఉత్కంఠభరితమైన ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి, మన #AsianGames #cricket స్వర్ణ పతకాన్ని విజయవంతంగా నిలబెట్టుకున్న టీమ్ ఇండియాకు అభినందనలు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మల ప్రత్యేక ప్రదర్శనలు ఈ ఫైనల్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. అలాగే మన మహిళల జట్టు కూడా స్వర్ణం గెలవడంతో, ఏషియన్ గేమ్స్‌లో భారత్ అద్భుతమైన ‘క్రికెట్ డబుల్’ (పురుషులు, మహిళలు ఇద్దరూ స్వర్ణం సాధించడం) పూర్తి చేసింది’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
