నేడు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు.. తొలి విడతలో ఎకరా వరకు, చెక్ చేసుకోండి

Date:

తెలంగాణలో యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం బటన్ నొక్కి రూ. 3,446.94 కోట్లు విడుదల చేయగా.. నేడు సుమారు 68.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యతనిస్తూ, ఎకరాకు రూ. 6 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు.

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్. నేడు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. యాసంగి సీజన్‌కు పంటల పెట్టుబడి కోసం రేవంత్ ప్రభుత్వం మొదటి విడతలో రూ.3,446.94 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేసింది. 68,89,955 మంది రైతుల ఖాతాల్లో నేడు డబ్బులు జమ కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో ఆదివారం (మార్చి 22) సీఎం రేవంత్‌ రెడ్డి బటన్‌ నొక్కి నిధుల విడుదల చేయగా.. ఆదివారం సెలవుదినం కావడంతో నేడు ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులను పరిగణనలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తుండగా.. ఈ డబ్బులను రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున తాజాగా నిధులు విడుదల చేశారు. ఈ నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు రూ.268.57 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లాలో 24,935 మంది రైతులకు రూ.10.43 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇవాళ ఉదయం బ్యాంకులు ఓపెన్ కాగానే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఆమేరకు బ్యాంకుల నుంచి రైతులకు మేసేజ్‌లు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి, నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...