
విజయనగరం దాసన్నపేట, జూలై 7(ఆంధ్రజ్యోతి): యువత క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవ ర్చుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి చాంపియ న్‌షిప్-2026 పోస్టర్‌ను ఎస్పీ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా క్రీడల వైపు అడుగులు వేయాలన్నారు. ఈనెల 15 నుంచి 25 వరకూ నియోజకవర్గ స్థాయిలో, జూలై 26 నుంచి ఆగస్టు-10 వరకూ జిల్లా స్థాయిలో, ఆగస్టు 20 నుంచి 25వరకూ రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తామ ని తెలిపారు.
ఈ పోటీల్లో బ్యాడ్మింటన్, బాక్సింగ్, బా స్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా వంటి క్రీడలు నిర్వహిస్తారన్నారు. 12 క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరి చిన క్రీడాకారులకు రూ.90వేల నగదు బహుమతిని అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ది అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, స్కూల్ గే మ్స్ ఫేడరేషన్ జిల్లా కార్యదర్శులు కె.వేణుగోపాల్, విజ యలక్ష్మి, బాక్సింగ్ కోచ్ బి.ఈశ్వరరావులు పాల్గొన్నారు.

