
బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఓ బాలుడు వింత అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఒంటిపై నిప్పులు పోసినట్లుగా తీవ్రమైన మంటలు రావడంతో, ఉపశమనం కోసం రాత్రింబవళ్లు చెరువులోని నీటిలోనే గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులు అతడికి మెరుగైన వైద్యం అందించలేకపోయారు.
ఈ విషయం రిలయన్స్ సంస్థల ఈడీ అనంత్ అంబానీ దృష్టికి వెళ్లడంతో ఆయన చలించిపోయారు. బాలుడి పరిస్థితిని తెలుసుకున్న వెంటనే స్పందించి, అతడిని ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించారు. అనంతరం తమ ఆసుపత్రిలో చేర్పించి, అవసరమైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు.
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి, బాలుడి ప్రాణాలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకున్న అనంత్ అంబానీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భరించలేని మంటలతో ఉపశమనం కోసం రోజుల తరబడి చెరువుల్లోనే ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు ఇక్బాల్ షేక్‌కు బిలియనీర్ అనంత్ అంబానీ అండగా నిలిచారు. ముర్షిదాబాద్‌కు చెందిన ఇక్బాల్ వింత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం, అతడి కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెంటనే స్పందించారు.
బాలుడిని ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించి, సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య నిపుణుల బృందం ఇక్బాల్‌కు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి, అతడి సమస్యకు కారణాలను గుర్తించడంతో పాటు అవసరమైన చికిత్స అందించనుంది.
ఇక్బాల్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామంలోని చెరువుల్లో ఈదుతూ గడిపేవాడని, ఒక చెరువు నుంచి మరో చెరువుకు మారుతూ ఉండేవాడని తెలిపారు. నీటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒళ్లంతా నిప్పులు పోసినట్లుగా తీవ్రమైన మంటలు మొదలవుతాయని బాలుడు చెప్పాడు. ఆ సమయంలో తనను ఏదో అదృశ్య శక్తి ఆవహించినట్లు అనిపిస్తుందని అతడు వివరించాడు.
చెరువులోనే ఉండి అల్పాహారం తింటున్న ఇక్బాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఈ విషయం అనంత్ అంబానీ దృష్టికి చేరడంతో ఆయన తక్షణమే స్పందించి, మెరుగైన వైద్యం కోసం బాలుడిని ముంబయికి తీసుకురావడంతో కుటుంబానికి కొత్త ఆశ కలిగింది.

