Andhra: వారసులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ రూ.100కే భూముల రిజిస్ట్రేషన్..

Date:

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూమి రిజిస్ట్రేషన్‌ను కేవలం రూ.100 కే చేయాలని నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షల లోపు విలువ గల వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఇకపై కేవలం రూ.100 మాత్రమే వసూలు చేయనున్నారు.

అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను మరింత సులభతరం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది.. ఈ మేరకు ఏపీ రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పులు చేసి, సాఫ్ట్‌వేర్ ను అప్డేట్ చేశారు. రూ.10 లక్షల లోపు విలువ గల వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం రూ.100 మాత్రమే వసూలు చేసేలా ఆదేశాలు కూడా ఇచ్చారు.

ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించామని, కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

వారసత్వ ఆస్తుల విలువ రూ.10 లక్షలు దాటితే రిజిస్ట్రేషన్ కోసం రూ.1000 వసూలు చేయనున్నట్లు మంత్రి సత్యప్రసాద్ వివరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

కాగా చాలా ప్రాంతాల్లో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ ఎకరం రూ.10 లక్షల లోపే ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...