Andhra News: పైనచూస్తే తెల్లటి సంచులు.. డౌట్ వచ్చి విప్పి చూడగా.. దిమ్మతిరిగే సీన్

Date:

ఏపీలో మరోసారి భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు అల్లూరి జిల్లా పోలీసులు. రాష్ట్రంలో అక్రమ గంజాయి రవాణా సాగుతుందన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు..అల్లూరి జిల్లా పెదబయలు మండలం కుజుబంగి జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టి గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి 1,373 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న సుమారు 1,373కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో అక్రమ గంజాయి రవాణా జరుగుతుందనే సమాచారంతో ఎస్పీ అమిత్ బర్దార్ పోలీసులకు కీలక దేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాలతో అల్లూరి జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం ఉన్న చోట నిఘా పెంచ్చారు. అక్రమ గంజాయి రవాణా, సాగుపై పక్కడ్బంది ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

అయితే ఇందులో భాగంగానే ముంచింగిపుట్టు పోలీసులు కుజభంగి జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. అయితే అటుగా వెళ్తున్న ఓ బొలేరో వాహనంపై అనుమానం రావడంతో ఆపి క్షుణ్నంగా చెక్‌ చేశారు.అయితే అందులో తెల్లటి సంచులు ఉండగా.. వాటిని ఓపెన్ చేసి చూశారు. అంతే ఒక్కసారిగా గంజాయి వాసన గుప్పుమంది. మొత్తం 43 బస్తాల్లో భారీ మొత్తం గంజాయి ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. వారి నుంచి సుమారు1373.72 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని.. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తులు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు ఒడిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా, చిత్రకొండ బ్లాక్ నుండి పెదబయలు మండలం జామిగూడ, రూడకోట మీదుగా వాహనం వస్తున్నట్టు గుర్తించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమంది నిందితులు పరారయ్యారు, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో గంజాయి సాగు ఎక్కడా లేదని, అక్రమ రవాణాపై గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు పోలీసులు. గంజాయి వల్ల జరిగే అనర్థాల గురించి వివరిస్తూ, యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

వార్నీ.. ఇన్నాళ్లూ సోంపు నీళ్లను ఇంత లైట్ తీసుకున్నామా? రోజూ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతున్నాయా?...

దానిమ్మతో చెడు కొవ్వుకు చెక్.. ఇలా తీసుకుంటే ప్రయోజనాలు పొందొచ్చా?

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరుగుతుందా? ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా గుండెను...

లక్షలు కాదు.. కోట్ల కిలోలు! 24 గంటల్లో భారతీయులు తినే చక్కెర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఉదయం నిద్రలేవగానే తాగే వేడి టీ నుంచి రాత్రి పడుకునే ముందు...