ఏపీలో 2 కొత్త ప్రైవేట్‌ యూనివర్సిటీలు, ఎల్ అండ్ టీకి అమరావతి ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం.. కేబినెట్ నిర్ణయాలివే!

Date:

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 34 అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుతోపాటు.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణాన్ని ఎల్ అండ్ టీకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026, ఏపీ పీపీపీ పాలసీ-2026, పాదచారుల భద్రత పాలసీ, అమరావతి అభివృద్ధి, విద్య, పరిశ్రమలు, చట్ట సంస్కరణలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ సమావేశంలో మొత్తం 34 అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అభివృద్ధి, విద్య, పరిశ్రమలు, మౌలిక వసతులు, చట్ట సంస్కరణలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని అమరావతి అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి రూ.1,002.49 కోట్ల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి అప్పగించేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అదనంగా అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ భవనాల డిజైన్ల పూర్తి కోసం అదనపు నిధుల కేటాయింపుకు అంగీకారం తెలిపింది.

అమరావతి భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం (జీఓఎం) చేసిన సిఫార్సులను ఏపీ కేబినెట్ ఆమోదించింది. అలాగే ‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు రీ-టెండర్లు నిర్వహించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026 ముసాయిదాతో పాటు ఏపీ పీపీపీ పాలసీ-2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ భూముల్లో మొబైల్ టవర్ల ఏర్పాటుకు.. రాయితీ విద్యుత్ అందించేందుకు కూడా అనుమతి ఇచ్చింది.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. వీటి స్థానంలో ప్రజల భద్రత, భూముల రక్షణకు మరింత సమర్థవంతమైన కొత్త చట్టాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్నత విద్యను విస్తరించే లక్ష్యంతో 2 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొత్త జిల్లాల్లో విద్యా పరిపాలనను బలోపేతం చేయడానికి 15 కొత్త జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పోస్టుల సృష్టికి కూడా ఆమోదం తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...