
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నవంబర్ 27న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి కేబినెట్ భేటీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. మంత్రులు అందుబాటులో ఉంటే సచివాలయంలో జరిగే సమావేశానికి ప్రత్యక్షంగా హాజరుకావాలని ఇతరులు వర్చువల్‌గా పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సోమవారం కేబినెట్ నోట్ జారీ చేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నవంబర్ 26న జరగాల్సి ఉంది.
అయితే అదే రోజు రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన సమావేశాన్ని ఒక రోజు వాయిదా వేసి నవంబర్ 27న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.




