స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీటుగా స్పందించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కీలక మీడియా సమావేశంలో ప్రతిపక్ష విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
“తమ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసినవారికి ఎన్నికల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
