ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: నక్కపల్లి.. ఔషధ పరిశ్రమలకు కొత్త కేంద్రంగా మారుతుందా?

Date:

ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో నిలవడంలో నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే లైన్లు, జాతీయ రహదారులు ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని ఇంతకు ముందు భాగంలో చెప్పుకున్నాం కదా. నక్కపల్లిలో ప్రతిపాద బల్క్ డ్రగ్ పార్క్, పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్, గూగుల్ డేటా సెంటర్, ఆరెస్సెఎల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంత అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తాయి. ఐటీ, సేవా రంగం విశాఖతోపాటు విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలకు విస్తరిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కొత్త కోణం వచ్చి చేరుతుంది.

అనకాపల్లి జిల్లా పరిధిలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ కేవలం మరో పారిశ్రామిక ప్రాజెక్టు కాదు. దేశంలో ఔషధ ముడి పదార్థాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, ఎగుమతి అవకాశాలను విస్తరించడం వంటి జాతీయ లక్ష్యాలతో ఇది అనుసంధానమై ఉంది. ఉత్తరాంధ్ర కోణంలో చూస్తే, దీని ప్రాధాన్యం వేరే ఉంది. భారీ పరిశ్రమలకే పరిమితమైన ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు, విలువ ఆధారిత తయారీ రంగాలను చేర్చే అవకాశం ఇందులో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి, అనుబంధ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ తరహా ప్రాజెక్టుల విజయాన్ని కేవలం శంకుస్థాపనలతో కొలవలేం. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ప్రవాహం, పరిశ్రమల స్థాపన… ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయినప్పుడే అసలు ఫలితం తెలుస్తుంది. ఔషధ ముడి పదార్థాల ఉత్పత్తిలో దేశీయ సామర్థ్యాన్ని పెంచే జాతీయ వ్యూహంలో భాగంగా ఈ ప్రాజెక్టును చూడాల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా పరిశుభ్రమైన ఇంధన వనరుల వైపు అడుగులు పడుతున్న సమయంలో ఉత్తరాంధ్ర కూడా ఆ పరిణామంలో భాగస్వామి కావాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. పూడిమడక ప్రాంతంలో ప్రతిపాదిత గ్రీన్ హైడ్రోజన్ హబ్ అందుకు ఒక ఉదాహరణ. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను కేవలం ఇంధన రంగానికి మాత్రమే పరిమితం చేయలేం. విద్యుత్ ఉత్పత్తి, ఎగుమతులు, భారీ పరిశ్రమలు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, భవిష్యత్ సాంకేతికతలతో ఇవి ముడిపడి ఉంటాయి. అందువల్ల ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఉత్తరాంధ్రకు సంప్రదాయ పరిశ్రమలతో పాటు భవిష్యత్ ఇంధన ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక స్థానం ఏర్పడే అవకాశం ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...