
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. సీడ్ యాక్సెస్ రోడ్డును వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది.
కొంతమంది అభ్యంతరాల కారణంగా రాజధాని అభివృద్ధి పనులు నిలిచిపోకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో అమరావతిలో పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి అభివృద్ధిలో కీలకమైన భాగమని హైకోర్టు పేర్కొంది. కొద్దిమంది అభ్యంతరాల కారణంగా విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన అభివృద్ధి పనులు నిలిచిపోకూడదని అభిప్రాయపడింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పుతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. దీంతో అమరావతిలో పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం మరింత వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
:::
సీఆర్డీఏ పరిధిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
భూసేకరణ ప్రక్రియలో అధికారులు చట్టపరమైన నిబంధనలను పాటించడం లేదని రైతులు తమ పిటిషన్‌లో ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌తో పాటు సంబంధిత ప్రొసీడింగ్స్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోర్టును కోరారు.
ఈ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
:::

