రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ విడుదలైంది. 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ విడుదలైంది. 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మొదలవుతాయి. మార్చి 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఏ రోజు ఏ సబ్జెక్టుకు పరీక్ష నిర్వహించనున్నారనే పూర్తి వివరాలను విద్యార్థులు అధికారిక టైమ్‌టేబుల్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు

జనరల్‌ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి పి. రంజిత్‌ బాషా తెలిపారు.

  • మొదటి సెషన్‌: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
  • రెండో సెషన్‌: మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.

ఆదివారాల్లోనూ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్‌ తాత్కాలికమైనదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు తుది టైమ్‌టేబుల్‌ కోసం అధికారిక ప్రకటనలను పరిశీలించాలి. సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలు, ఇతర మార్గదర్శకాల కోసం ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *