
రాజ్యసభలో ఓ దక్షిణాది ఎంపీ ప్రసంగిస్తున్న సమయంలో మహిళా ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. కేరళకు చెందిన సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఈ ఘటనపై సభాహక్కుల నోటీసు ఇచ్చారు. తనను ‘లుంగీవాలా’ అంటూ అవమానకరంగా సంబోధించారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంపై రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ స్పందిస్తూ.. సభలో ప్రతి సభ్యుడు హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. ఇతర సభ్యుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం లేదా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు.
పార్లమెంట్‌లో ‘లుంగీవాలా’ వ్యాఖ్యల వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తనను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ ‘లుంగీవాలా’ అంటూ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభలో బ్రిట్టాస్ తీర్మానం ప్రవేశపెట్టారు.
తాను దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తినని, తన సంప్రదాయ ఆహార్యం పట్ల ఎంతో గర్వంగా ఉంటానని బ్రిట్టాస్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా భావించే పార్లమెంట్ వేదికపై ఓ ప్రాంతం, అక్కడి ప్రజల సంస్కృతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు.
రాజ్యసభలో తాను ప్రసంగిస్తున్న సమయంలో తనను ఉద్దేశించి ‘లుంగీవాలా’ అంటూ అమర్యాదకర వ్యాఖ్యలు చేశారని ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. తాను ధోతి ధరించిన మలయాళీ, దక్షిణాది వ్యక్తినని, తన సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఎంతో గర్వంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఒక ప్రాంతం లేదా సంస్కృతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
ఈ అంశంపై సభ దృష్టి సారించాలని కోరుతూ సంబంధిత ఎంపీపై ప్రివిలెజ్ మోషన్ ప్రవేశపెట్టినట్లు బ్రిట్టాస్ తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదని, అయితే సభలో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ పదేపదే తన ప్రసంగానికి అంతరాయం కలిగించారని ఆరోపించారు. పలుమార్లు ‘లుంగీవాలా’ అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించారని ఆయన పేర్కొన్నారు.

