ఏఐ రాకతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. దీంతో చాలామంది తమ ఉద్యోగాలను వదిలేసి వ్యాపారులను మొదలుపెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక వ్యాపారాలకు మంచి డిమాండ్ ఉంది. డిమాండ్ ఉన్న వ్యాపారాలు స్టార్ట్ చేయడం వల్ల రోజూ ఆదాయం పొందవచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఈ టెక్నాలజీ రాకతో లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. కంపెనీల లేఆఫ్‌లతో లక్షల్లో సంపాదించే ఉద్యోగులు తమ ఆదాయాన్ని కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్నారు. ఈ క్రమంలో చాలామంది అప్పటివరకు కూడబెట్టుకున్న డబ్బులతో ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అలాంటివారికి బెస్ట్ బిజినెస్ ఐడియాలు ఏంటో చూద్దాం

ప్రస్తుతం ఫుడ్ డెలివరీ యాప్స్‌కు మార్కెట్లో ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించడం వల్ల మంచి లాభం ఉంటుంది. ఆహార పదార్థాలు తయారుచేసి స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ద్వారా విక్రయించవచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్, వాట్సప్ బిజినెస్ అకౌంట్ కొత్త కస్టమర్లకు చేరుకోవచ్చు. అలాగే సిటీలు, పట్టణాల్లో లాండ్రీ, డ్రైక్లీనింగ్ సేవలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

వాషింగ్ మెషిన్లు, డ్రైయర్లు, ఇస్ట్రీ మెషిన్లను ఏర్పాటు చేసుకుని డ్రైక్లీనింగ్ వ్యాపారం తక్కువ ఖర్చుతో మొదలుపెట్టవచ్చు. ఆస్పత్రులు, హోటళ్లు వంటివారితో మీరు ఒప్పందం కుదుర్చుకోవచ్చు. దీని వల్ల మీకు రోజూ ఆదాయం లభిస్తుంది. ఇక ఇటీవల సిటీలలో అద్దె వ్యాపారం బాగా జరుగుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫొటోగ్రఫీ, బైక్‌లు, ఈవెంట్ అలంకరణ వస్తువులు వంటివి రెంట్‌కు ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు

ఇక బ్యూటీ సెలూన్ బిజినెస్ కూడా రోజూ మీకు ఆదాయన్ని తెచ్చి పెడుతుంది. మేకప్, హెయిర్ స్ట్రైల్, వంటి సేవలు అందించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించడం వల్ల మీ సెలూన్‌కు ఆదరణ మరింత పెరుగుతుంది. ప్రాంచైజీలను విస్తరించుకోవడం వల్ల లక్షల్లో సంపాదించవచ్చు. నైపుణ్యం ఉన్న బ్యూటీషియన్లను నియమించుకుంటే సరిపోతుంది.

అలాగే పాత వస్తువులను రీపేర్ చేసి సెకండ్ హ్యాండ్స్ వస్తువుల రూపంలో అమ్మడం ద్వారా కూడా రోజూ ఆదాయం పొందవచ్చు. ల్యాప్‌టాప్స్, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటికి అవసరమైన రీపేర్లు చేసి విక్రయించడం ద్వారా అధిక ఆదాయం పొందే మార్గం ఉంది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *