కాల్‌ డ్రాప్‌ సమస్యలకు చెక్..! ట్రాయ్ తీసుకున్న చర్యల గురించి తెలుసుకున్నారా

Date:

మొబైల్ వాడుతున్నప్పుడు తరచూ కాల్స్ కట్ కావడం, అవతలి వారి మాటలు వినపడకపోవడం వంటి సమస్యలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ టెలికాం నియంత్రణ సంస్థ సరికొత్త రూపంలో మైకాల్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నెట్‌వర్క్ నాణ్యతను మెరుగుపరిచే ఈ అద్భుతమైన యాప్ విశేషాలను తెలుసుకుందాం.

ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఎదురయ్యే నెట్‌వర్క్ సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు ట్రాయ్ సరికొత్త వేదికను అందించింది. వాయిస్ కాల్ క్వాలిటీని అంచనా వేయడానికి రూపొందించిన ఈ అప్‌గ్రేడెడ్ యాప్ పూర్తి వివరాలను తెలుసుకుందాం..

కవరేజ్ టెస్ట్

కాల్​ మాట్లాడుతున్నప్పుడు తరచూ కాల్స్ కట్ అయిపోవడం, అవతలి వారి మాటలు వినపడకపోవడం వంటి సమస్యలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తన మైకాల్ యాప్‌ను సరికొత్త రూపంలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మొబైల్ వినియోగదారులు తమ వాయిస్ కాల్ నాణ్యత ఎలా ఉందో రిపోర్ట్ చేయవచ్చు.

ఈ యాప్ ద్వారా వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్‌ను మెరుగుపరుచుకుంటాయని ట్రాయ్ తెలిపింది. ఈ అప్‌గ్రేడ్ చేసిన యాప్‌లో ప్రతి కాల్ పూర్తయిన వెంటనే దాని నాణ్యతపై 1 నుండి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాల్ నాణ్యత బాగుందో లేదో యాప్ ఆటోమేటిక్‌గా అడుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా నెట్‌వర్క్ సమస్యను ఎదుర్కొంటే అసలు ఏం జరిగిందనేది స్పష్టంగా ఫీడ్‌బ్యాక్ రూపంలో నమోదు కూడా చేయవచ్చు. ఉదాహరణకు కాల్ కట్ కావడం, వాయిస్ గజిబిజిగా వినపడటం, క్రాస్ కనెక్షన్లు, కాల్ కనెక్ట్ అవ్వడానికి చాలా సమయం తీసుకోవడం వంటి సమస్యలను నేరుగా ట్రాయ్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

ఈ ఫీడ్‌బ్యాక్‌ను ట్రాయ్ సంబంధిత టెలికాం ఆపరేటర్లకు అందజేస్తుంది. ఈ క్రమంలో యూజర్ల గుర్తింపును ట్రాయ్ పూర్తి గోప్యంగా ఉంచనుండటం గమనార్హం. మరోవైపు ట్రాయ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాలను టెలికాం కంపెనీలు సులభంగా గుర్తించి వెంటనే అక్కడ సేవలను సరిచేసే అవకాశం లభిస్తుంది.

ఇంటరాక్టివ్ మ్యాప్ ప్రత్యేకతలు

కేవలం కాల్స్ రేటింగ్ ఇవ్వడమే కాకుండా ఈ కొత్త మైకాల్ యాప్‌లో కవరేజ్ టెస్ట్ అనే ఫీచర్ ద్వారా మీ ప్రాంతంలో సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇప్పటివరకు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఒక ఇంటరాక్టివ్ మ్యాప్ రూపంలో చూసుకునే వెసులుబాటును కూడా ట్రాయ్ కల్పిస్తోంది.

యాప్ అప్ గ్రేడ్ సందర్భంగా ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటి మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడి ఫీడ్‌బ్యాక్ ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ అనుభవాన్ని పంచుకోవాలని కోరారు. ఇది దేశంలో మెరుగైన కాలింగ్ అనుభవాన్ని అందించడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్యక్తిగత సమస్యలకు వర్తించదు..

అయితే మైకాల్ యాప్ అనేది వ్యక్తిగత సమస్యలను రిపోర్ట్ చేసే వేదిక కాదని ట్రాయ్ స్పష్టం చేసింది. బిల్లింగ్ సమస్యలు, సిమ్ కార్డ్ లోపాలు, ఇతర వ్యక్తిగత సేవల సమస్యల కోసం వినియోగదారులు నేరుగా సంబంధిత టెలికాం ఆపరేటర్‌నే సంప్రదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ యాప్ కేవలం దేశవ్యాప్తంగా వాయిస్ కాల్ నాణ్యతను అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న ఈ తరుణంలో వినియోగదారుల సౌలభ్యం కోసం తెచ్చిన ఈ యాప్ టెలికాం రంగంలో కీలక మార్పులు తీసుకురానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...