తెలంగాణ మంత్రికి చంద్రబాబు, లోకేష్ విషెస్.. కాంగ్రెస్‌లో ఉన్నా సరే ఎంతో గౌరవం

Date:

తెలంగాణ మంత్రి సీతక్కకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే సీతక్క విషయంలో చంద్రబాబు ఎంతో గౌరవంగా ఉంటారు. సీతక్క కూడా చంద్రబాబుపై అభిమానంతో ఉంటారు.. ఆయన ఇంటికి వెళ్లి రాఖీ కడుతుంటారు. ఇవాళ సీతక్క బర్త్ డే కావడంతో విషెస్ తెలియజేశారు. సీతక్క కూడా చంద్రబాబు తన రాజకీయ గురువు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

రాజకీయాల్లో చాలామంది పార్టీలు మారుతుంటారు.. అలా కండువా మార్చగానే అప్పటి వరకు పనిచేసిన పార్టీలపై విమర్శలు చేసిన సందర్భాలు చాలానే చూశాం. వీరిలో ఫంక్షన్లు, కార్యక్రమాలకు హాజరైన సమయంలో ఎదురుపడినా పలకరించుకోని నేతలు ఉన్నారు. కొందరు మాత్రం అలా కాకుండా పార్టీ మారినా సరే.. గతంలో పనిచేసిన పార్టీల అధినేతలు, ముఖ్య నేతల విషయంలో మర్యాదగా వ్యవహరిస్తుంటారు.. అప్పుడప్పుడు కలుస్తుంటారు, బాగోగుల గురించి మాట్లాడుకుంటూ బర్త్ డే రోజు విషెస్ వంటివి కూడా చెప్పుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి నేతలు చాలామందే ఉన్నారు.. వారిలో తెలంగాణ మంత్రి సీతక్క కూడా ఒకరు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినా సరే.. టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల అభిమానంతో ఉంటారు.. చంద్రబాబు కూడా సీతక్కకు ఆ గౌరవాన్ని ఇస్తుంటారు.

ఇవాళ మంత్రి సీతక్క పుట్టిన రోజు కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మీరు మరిన్ని విజయాలు సాధిస్తూ, ఆయురారోగ్యాలతో ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ చంద్రబాబు విషెస్ తెలిపారు. మంత్రి లోకేష్ కూడా సీతక్కకు విషెస్ తెలిపారు. ‘తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి ధనసరి సీతక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన ఆమె జీవిత ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న సీతక్క గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...