మంథా తుఫాను భయంతో కోస్తా జిల్లాల్లో కదలికలు

0
19

తుఫాను ‘మొంథా’ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర జిల్లాలు అలర్ట్‌లోకి వెళ్లాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన గంభీర అల్పపీడనం తుఫానుగా మారి మచిలీపట్నం నుంచి కలింగపట్నం మధ్య తీరప్రాంతానికి అక్టోబర్‌ 28 సాయంత్రం లేదా రాత్రి దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాన్‌ ప్రభావంతో తీర ఆంధ్ర జిల్లాల్లో 90 నుండి 110 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కృష్ణా, గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. తక్కువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు సూచించారు. పాఠశాలలు, విద్యాసంస్థలకు కొద్ది రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు, కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండమని ఆదేశాలు జారీచేసింది