
ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆయన అధికారులను సూచించారు. ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. నిర్మాణ నాణ్యత, పనుల పురోగతిపై ఆరా తీశారు. నిర్ణీత ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
