
విజయవాడ, అక్టోబర్ 6 : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ‘దసరా-2026’ స్మార్ట్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో యాప్‌ను ప్రారంభించారు.
అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా ఉత్సవాల్లో భక్తులకు దర్శన సమయాలు, క్యూలైన్లలో వేచి ఉండే సమయం, పార్కింగ్, తాగునీరు, వైద్యం, ప్రసాదం తదితర వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మ్యాప్, నావిగేషన్ సదుపాయాలతో పార్కింగ్, స్నాన ఘాట్లు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స కేంద్రాలను సులభంగా గుర్తించవచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక శాఖలను ఒక్క క్లిక్‌తో సంప్రదించే సదుపాయం కల్పించారు. కృత్రిమ మేధ ఆధారిత ‘దసరా ఏఐ’ ద్వారా తెలుగు, ఆంగ్లంలో టెక్స్ట్ లేదా వాయిస్‌తో ప్రశ్నలు అడిగి ఉత్సవాలు, దర్శనాలు, పూజల వివరాలు తెలుసుకోవచ్చు.
ఇంద్రకీలాద్రిపై జరిగే పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలను లైవ్‌లో వీక్షించడంతో పాటు ఫిర్యాదులు, అభిప్రాయాలను యాప్ ద్వారా నమోదు చేయవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో ‘దసరా 2026’ అని సెర్చ్ చేసి యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
