9 జిల్లాల్లో 100 గ్రామాల అభివృద్ధి.. ఐటీసీ భాగస్వామ్యంతో ముందడుగు

Date:

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఐటీసీ సంస్థ భాగస్వామి కానుందని స్వర్ణాంధ్ర పీ 4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 100 గ్రామాల అభివృద్ధికి ఐటీసీ సహకరించనుందని ఆయన వెల్లడించారు. మూడేళ్ల కాల పరిమితితో ఈ ప్రాజెక్టు అమలుకానుంది. కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా అమలు చేయడంతోపాటు వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించున్నారు. గ్రామీణ ప్రజల జీవనోపాధి, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.

రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 100 గ్రామాల అభివృద్ధికి ఐటీసీ సహకరించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు, సమగ్ర గ్రామీణాభివృద్ధిలో ఐటీసీ సంస్థ భాగస్వామ్యం కానుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో జరగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఐటీసీ తనవంతు సహాయ సహకారాలు అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ కుటుంబాల జీవనోపాధి పెంచడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధితో పాటు అక్కడి ప్రజలకు మెరుగైన జీవన అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమం మూడేళ్ల కాలపరిమితితో ఐటీసీ భాగస్వామ్యంతో అమలు కానుంది. ఐటీసీతో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా అమలు చేయడంతో పాటు వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. ఇందులో భాగంగా కార్యక్రమం అమలు, పర్యవేక్షణకు ప్వర్ణాంధ్ర ఫౌండేషన్, ఐటీసీ ప్రతినిధులతో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...