
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేశారు.
ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
for more:Mptc Zptc election live ubdates in dtv digital
