సముద్రంలో గల్లంతయిన మత్స్యకారులు.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశం

Date:

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ 14 రోజులైనా లభించలేదు. ఆగస్టు 3న వేటకు వెళ్లిన వారు గంట తర్వాత స్థానికులతో కమ్యూనికేషన్ కోల్పోయారు. పది రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా ఇప్పటికీ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు గల్లంతైన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గాలింపు చర్యల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనపై కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కుటుంబ సభ్యులు మెరైన్ పోలీసులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...

ఒంటరి మహిళలే టార్గెట్.. మాటు వేసి చంపేస్తాడు.. రెండేళ్లలో ఇద్దరు!

మార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలం డీజీపేటలో జరిగిన మహిళ హత్య కేసును...