బ్లాక్‌మనీ ఇస్తానంటూ.. పిల్లలు ఆడుకునే నోట్లు ఇచ్చిన కేటుగాళ్లు, కత్తుల వరకూ వెళ్లడంతో అరెస్ట్

Date:

తమ దగ్గర బ్లాక్ మనీ ఉందని.. వైట్‌లో డబ్బులు ఇస్తే ఒక నోటుకు ఐదు నోట్లు ఇస్తామని చెప్పడంతో ఒక వ్యక్తి ఆశపడ్డాడు. సరే, ముందు చూసొద్దామని కేటుగాళ్ల దగ్గరకు వెళ్లడంతో వాళ్లు పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ చూయించి, ఇదే బ్లాక్ మనీ అని నమ్మించారు. విషయం తెలుసుకున్న అతను అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేయగా.. కత్తులతో బెదిరించి అతని దగ్గర ఉన్న డబ్బంతా దోచుకున్నారు ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.

ఒకనోటుకు ఐదు నోట్ల బ్లాక్ మనీ ఇస్తానని చెప్పడంతో అతను ఆశపడ్డాడు. డీల్ ఇంట్లోనే పెట్టుకుందాం అనేసరికి పని ఈజీగా అయిపోతుంది అనుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత బ్లాక్ మనీకి బదులు పిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్లను బ్లాక్ మనీగా చూయించారు. అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా కత్తులతో బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన తిరుపతి పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన అజ్మీరా రాజారామ్‌కు బ్లాక్ మనీ ఇస్తామని పిచ్చాటూరుకు చెందిన ప్రకాశ్ నమ్మబలికాడు. అసలు కరెన్సీ ఇస్తే తనకు బ్లాక్ మనీ రూపంలో ఐదు రెట్లు ఇస్తానని చెప్పడంతో రాజారామ్ ప్రకాశ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీని చూయించి ఇదే బ్లాక్ మనీ అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశాడు. అది పసిగట్టిన రాజారామ్ అక్కడ నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...