అయోధ్య, కాశీ వెళ్లాలనుకునే వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ ట్రైన్‌లో ఉచిత ప్రయాణం.. అర్హులు వీరే!

Date:

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని భక్తులను ఉంచితంగా అయోధ్య రామయ్య దర్శనం కల్పిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎంపీ సీఎం రమేష్ నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అనకాపల్లి నుంచి 1500 మంది భక్తులతో కాశీ, అయోధ్యకు వెళ్తున్న ట్రైన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ యాత్రలో భక్తులకు ప్రయాణం, వసతి, భోజనం అన్ని ఉచితంగా అందించనున్నారు.

అయోధ్య, కాశీ వెళ్లాలి అనుకునే భక్తులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.. త్వరలో అనకాపల్లి నుంచి అయోధ్య, కాశీ ప్రత్యేక ట్రైన్ బయల్దేరనుంది. ఈ యాత్రలో వెళ్లే భక్తులకు ప్రయాణంతో పాటు వసతి, భోజనం, వైద్యం.. అన్ని ఉచితంగా లభించనున్నాయి. అవును ఇటీవలే అనకాపల్లి నుంచి సుమారు 1500 మందితో అయోధ్య, కాశీకి ప్రత్యేక ట్రైన్ బయల్దేరింది. అనకాపల్లి నుంచి అయోధ్య, కాశీ ఉచిత దివ్య దర్శన యాత్ర పేరుతో ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు ఈ ట్రైన్‌ను ఏర్పాటు చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆదివారం జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించారు.

తొలి విడతలో భాగంగా ఈ ట్రైన్‌లో మొత్తం 1500 మంది భక్తులను అయోధ్య, కాశీ యాత్రకు పంపారు. ఈ యాత్ర సుమారు ఐదు రోజుల పాటు సాగనుంది. ఈ ట్రైన్ ప్రారంభం సందర్భంగా ఎంపీ రమేష్‌ భక్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. స్పెషల్‌ ట్రైన్‌లోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంబందర్భంగా ఇచ్చిన తన హామీని నిలబెట్టుకున్నట్టు ఆయన తెలిపారు.

అయ్యోధ్య, కాశీకి వెళ్లాలని ప్రతి హిందువుకు ఉంటుందని.. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు అది కలగానే మిగిలిపోతుందని.. దాన్ని తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఐదు రోజుల యాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్లను కూడా నియమించినట్టు ఆయన తెలిపారు.

భక్తులు అక్కడిరి చేరుకున్న తర్వాత దర్శనం, వారి వసతి, భోజనం అన్నీ అక్కడున్న వాలంటీర్లే చూసుకుంటారని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని భక్తులకు దశల వారీగా కాశీ, అయోధ్య దర్శనం కల్పిస్తామని.. త్వరలో అంటే సెప్టెంబర్‌లో రెండో విడత కూడా ప్లాన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా అవసరమైన భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...