గోదావరి జలాలతో రాయలసీమ కరవు నివారణకు శాశ్వత పరిష్కారం: మంత్రి

Date:

రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (AP Minister Satyakumar Yadav) వ్యాఖ్యానించారు. పోలవరానికి కేంద్రం భారీ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.20,700 కోట్లను కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. మరో రూ.30 వేల కోట్లు ఇచ్చేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని చెప్పుకొచ్చారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకెళ్లటం వల్ల కరవు పరిస్థితులు నుంచి ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. బీజేపీ పోలవరం సందర్శన యాత్రలో లోటుపాట్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి 80 శాతం పనులు పూర్తి అయ్యాయని వివరించారు. పదిరోజుల్లో ఎడమ ప్రధాన కాలువ నుంచి నీళ్లు విడుదల చేస్తామని మాధవ్ వెల్లడించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...