అమెరికాలో పల్నాడు టెకీ మృతి.. గృహప్రవేశం చేసుకుని తల్లిదండ్రులతో గడిపిన వెంటనే విషాదం

Date:

చదువు కోసం పల్నాడు ప్రాంతం నుంచి అమెరికాకు వెళ్లిన యువకుడు అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. బాగా స్థిరపడటంతో పెళ్లి కూడా చేసుకున్నాడు. రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒహియో రాష్ట్రం కీవ్‌లాండ్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసిన యువకుడు.. ఆ గృహ ప్రవేశానికి తల్లిదండ్రులను కూడా అమెరికాకు తీసుకొచ్చాడు. అంతా సంతోషంగా ఉన్నారు అనుకున్న సమయంలో సడెన్‌గా హార్ట్ ఎటాక్‌కు గురయ్యాడు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేసినా ప్రాణాలు మాత్రం దక్కలేదు.

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.. బాాగా కష్టపడి చదవి, అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. సంపాదనలో బాగా స్థిరపడిన ఆ యువకుడు ఓ సొంత ఇంటిని కూడా కట్టుకున్నాడు. ఆ గృహప్రవేశ కార్యక్రమానికి తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాడు. కొడుకు ఎదుగుదల చూసి పొంగిపోయిన ఆ తల్లిదండ్రులు అంతలోనే కుంగిపోయారు. అందరితో కలిసి సరదాగా భోజనం చేసిన ఆ యువకుడు సడెన్‌గా హార్ట్ అటాక్‌‌కు గురయ్యాడు. ఈ ఘటనతో పల్నాడులో విషాద ఛాయలు అలముకున్నాయి.

పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రవితేజ (34) 2019లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒహియో రాష్ట్రం కీవ్‌లాండ్‌లో నివాసం ఉంటున్న అతను.. ఇటీవలే కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుని, ఆ వేడుకల్లో పాల్గొనేందుకు అతడి తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావు‌ కూడా అమెరికా వెళ్లారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...