వరంగల్‌లో బంగారం దొరికే సాగు భూమి.. కౌలు కోసం ఎగబడుతున్న రైతులు, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చు

Date:

భూమిలో బంగారం పండుతుందనే మాట వినే ఉంటారు. పంట బాగా పండితే ఆ మాటను వాడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం భూమిలో బంగారం దొరుకుతుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల వ్యవసాయ భూమిలో బంగారం దొరుకుతుందనే ప్రచారంతో ఆ భూమిని కౌలుకు తీసుకునేందుకు స్థానికులు పోటీ పడుతున్నారు. ఇటీవల ఈ పొలంలో కలుపు తీస్తుండగా మహిళా కూలీలకు పురాతన బంగారు ఆభరణాలు లభించడం హాట్ టాఫిక్‌గా మారింది. గతంలోనూ ఆ భూమిలో గుప్త నిధులు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు.

సాధారణంగా ఏ భూమికైనా పంటలు బాగా పండితే డిమాండ్ ఉంటుంది. కానీ.. ఈ భూమికి మాత్రం పంటలతో పని లేదు. ఎలాగైనా ఆ భూమిని కౌలుకు దక్కించుకోవాలని స్థానికులు ఉవ్విలూరుతున్నారు. మాకంటే మాకు కౌలుకు ఇవ్వాలంటూ భూమి యజమాని చుట్టూ పెద్ద సంఖ్యలో రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ భూమిని దక్కించుకుంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చుననే ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామ పరిధిలో ఉన్న ఒక ఆరెకరాల వ్యవసాయ భూమి ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఆరెకరాల భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఒక వ్యక్తి.. కోపాకులపాడు గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమిని ఈర్యతండాకు చెందిన ఒక రైతు కౌలుకు తీసుకుని ఏటా పత్తి సాగు చేస్తున్నారు. జూన్ 24న వర్షాలు కురవటంతో పత్తి చేనులో కలుపు తీయించడానికి మహిళా కూలీలను రంగంలోకి దించారు. పొలంలో పని చేస్తుండగా మట్టిలో నుంచి పురాతన కాలం నాటి బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. మొదట ఈ విషయాన్ని దాచాలని చూసినా.. గ్రామంలో ప్రచారం జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భూ యజమాని కూలీలను పిలిపించి విచారించగా.. వారు దొరికిన బంగారు వస్తువులను చూపించారు. దీనిపై యజమాని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...