సివిల్స్ ప్రిపరేషన్‌కు రూ. లక్ష సాయం.. అర్హతలు, దరఖాస్తు, పూర్తి వివరాలు

Date:

యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో పాసవ్వాలని లక్షలాది మంది నిరుద్యోగులు కలలు కంటారు. అయితే, అతికొద్ది మంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకోగలుగుతారు. సివిల్స్ సన్నద్ధతకు ఖర్చు ఎక్కువ కావడంతో పేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులు తమ కోరికను తీర్చుకోలేకపోతున్నారు. అలాంటి అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అమలు చేస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈ పథకానికి అవసరమైన నిధులను భరిస్తోంది. పూర్తి వివరాలు.

సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సాధించాలని లక్షలాది మంది నిరుద్యోగులు కలలు కంటారు. కానీ, వారిలో సగం మంది యూపీఎస్సీ పరీక్షలు కూడా రాయలేకపోతుంటారు. సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యేందుకు అయ్యే ఖర్చును భరించే స్తోమత లేక ఏటా వేలాది మంది తమ కోరికను చంపుకుంటారు. పేదరికం వల్ల ఏ ఒక్కరూ సివిల్ సర్వీసెస్ కోరికను చంపుకోవద్దనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం.

UPSC సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల శిక్షణ కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా రూ. 1 లక్ష అందిస్తారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులకు మరో లక్ష రూపాయల సాయం అందిస్తారు. సింగరేణి కాలరీస్ సంస్థ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ముఖ్య వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...