ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో భారీగా ఉద్యోగాలు మీకోసమే..! రాత పరీక్షలేదు

Date:

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 2026-27 సంవత్సరానికి 358 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల ఇంజినీరింగ్ పట్టభద్రులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా జులై 31, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) మార్కెటింగ్ డివిజన్‌.. 2026-27 సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో మొత్తం 358 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 31, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు..

  • మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య: 64
  • ఉత్తర్ ప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 37
  • గుజరాత్‌లో పోస్టుల సంఖ్య: 32
  • తమిళనాడులో పోస్టుల సంఖ్య: 20
  • తెలంగాణలో పోస్టుల సంఖ్య: 19
  • ఆంధ్రప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 15
  • ఢిల్లీలో పోస్టుల సంఖ్య: 18
  • రాజస్థాన్‌లో పోస్టుల సంఖ్య: 17
  • పంజాబ్‌లో పోస్టుల సంఖ్య: 16

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 31 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 31, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండా అభ్యర్థులను అకాడమిక్ మెరిట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, సంస్థ నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....