Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు

Date:

Hyderabad: హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల వ్యవహారం సంచలనంగా మారింది. హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని నకిలీగా ఉపయోగించి ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలు (NOC) సృష్టించిన 8 ప్రైవేట్ ఇంటర్ కళాశాలలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ కళాశాలలకు ఫైర్ ఎన్‌వోసీలు జారీ చేసే బాధ్యత హైడ్రా సంస్థదే. అయితే, హైడ్రా నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు జారీ కాకపోయినా, ఆయా కళాశాలల యాజమాన్యాలు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను రూపొందించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నకిలీ ధ్రువపత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించి కళాశాలల అనుమతులు పొందేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. ఇంటర్ బోర్డుకు వివిధ కళాశాలల నుంచి అందిన మొత్తం 76 ఫైర్ ఎన్‌వోసీలను హైడ్రా అధికారులు పరిశీలించగా, వాటిలో 8 కళాశాలలు సమర్పించిన పత్రాలు పూర్తిగా నకిలీవని నిర్ధారించారు.

ఈ ఘటనపై హైడ్రా అదనపు డైరెక్టర్ లేక్ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంబంధిత 8 ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోర్జరీకి పాల్పడిన కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని కోరుతూ హైడ్రా అధికారులు ఇంటర్మీడియట్ విద్యా మండలికి కూడా లేఖ పంపినట్లు సమాచారం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...