“మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మార్చి చూపిస్తా”: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నారా లోకేశ్

Date:

2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా అవహేళన చేశారని.. ఆ కసితోనే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక సంకల్పం పెట్టుకున్నానని నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చి దిద్దాలన్నదే తన సంకల్పమని చెప్పారు. మన ఇల్లు – మన లోకేశ్ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిని నిరుపేదల కోసం ఇళ్ల పట్టాల రూపంలో ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నా.. దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూయిస్తా అని మంత్రి లోకేశ్ అన్నారు. మన ఇల్లు – మన లోకేశ్ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో తన ఓటమికి చంద్రబాబును కూడా అవహేళన చేశారని, ఆ కసితోనే మంగళగిరి అభివృద్ధికి పూనుకున్నట్లు ఆయన తెలిపారు

మన ఇల్లు – మన లోకేశ్ పేరుతో మంగళగిరిలో మంగళవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా మూడు వేల మందికి ఇంటి పట్టాలు అందజేశారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తాను నిలబెట్టుకున్నానని, అందులో భాగంగానే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఆయన మాట ఇచ్చారు.

మంగళగిరిలోని రూ. వెయ్యి కోట్ల ఆస్తిని నిరుపేదల కోసం ఇళ్ల పట్టాల రూపంలో అందజేసినట్లు లోకేశ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఆదాయం రూ. 1 ఉంటే.. ఖర్చు రూ. 1.60 పైసలుగా ఉందని.. రెండేళ్ల అభివృద్ధిలోనే ఆ ఖర్చును రూ. 1.40 పైసలు చేర్చామని ఆయన తెలిపారు. తాము ఇస్తున్న శాశ్వత భూ పట్టాలతో పేదల ఆస్తిని ఎవ్వరూ కదిలించలేరని ఆయన స్పష్టం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...