IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లో విషాదం.. హైదరాబాదికి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి

Date:

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్లగురం దీపక్ రెడ్డి (36) తన నివాస క్వార్టర్స్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది.

బుధవారం ఉదయం నుంచి సహోద్యోగులు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే చాలా సేపటి వరకు క్వార్టర్స్ తలుపులు కూడా తెరవకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు హిజ్లీ ఔట్‌పోస్ట్ పోలీసులు భద్రతా సిబ్బంది సహాయంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా, దీపక్ రెడ్డి ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. అనంతరం వెంటనే ఆయనను క్యాంపస్‌లోని బీసీ రాయ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గదిని సీజ్ చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, పోస్టుమార్టం నివేదిక అనంతరమే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఎస్పీ పాపియా సుల్తానా తెలిపారు.

ఇది ఆత్మహత్యా? లేక ఉద్యోగ, వ్యక్తిగత లేదా ఇతర కారణాల వల్ల జరిగిన విషాదమా? అనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఈ ఘటనపై ఐఐటీ ఖరగ్‌పూర్ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...