#AlluriDistrict, #PostalBallot, #InvalidVotes, #TDP, #YSRCP, #IndependentCandidates, #ElectionResults, #AndhraPradesh

అల్లూరి జిల్లాలోని కొయ్యురు మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ కౌంటింగ్‌లో ఆసక్తికర ఫలితం వెలుగులోకి వచ్చింది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలకు వచ్చిన ఓట్ల కంటే చెల్లని ఓట్ల సంఖ్యే ఎక్కువగా నమోదైంది.

మొత్తం 201 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, వాటిలో టీడీపీకి 50, వైసీపీకి 54 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులకు 11 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు ఏకంగా 85 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.

https://dtvandhrapradesh.com

పోలైన ఓట్లలో చెల్లని ఓట్ల సంఖ్య అత్యధికంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోవడం ఆసక్తి రేపుతోంది.